సినీ ప్రపంచంలో కొన్ని బంధాలు కేవలం వృత్తిపరమైనవి మాత్రమే కాకుండా, వ్యక్తిగత ఆప్యాయతలు, మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటాయి. అలాంటి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని నటుడు బాబూ మోహన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు పంచుకున్నారు. సీనియర్ నటి జయసుధ ఆయనకు ఇచ్చిన ఒక తెల్ల సూట్ బహుమతి, అలాగే తన బాల్యంలో చెట్లపై గడిపిన సరదా క్షణాల గురించి ఆయన వివరించారు. ఈ సంఘటన ఒక సినిమా షూటింగ్ సందర్భంగా జరిగింది. జయసుధ గారు నిర్మించిన ఒక చిత్రంలో నటిస్తున్నప్పుడు, ఆయన తెల్ల సూట్ ధరించాల్సి వచ్చింది. ఆ సూట్‌ను ధరించగానే, ఆయనకు వెంటనే తన తండ్రి గుర్తుకువచ్చారు. తన తండ్రి కూడా అలాంటి తెల్ల సూట్లు ధరించేవారని, వాటి పట్ల ఆయనకు ఎంతో ఇష్టం ఉండేదని నటుడు గుర్తుచేసుకున్నారు. అద్దం ముందు నిలబడి, ఆ సూట్‌లో తనను తాను చూసుకుంటూ, తన తండ్రి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నప్పుడు, జయసుధ గారు, ఆమె భర్త ఆయనను గమనించారని.. ఆ సమయంలో తనకు తెలియదు కానీ, వారి పరిశీలన ఆయన జీవితంలో ఒక మధురమైన బహుమతికి దారితీసిందని అన్నారు.

షూటింగ్ పూర్తయిన తర్వాత, తాను నెల్లూరు నుండి మెడ్రాస్ (ప్రస్తుతం చెన్నై) వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, జయసుధ ఆయన్ని ఒక్క నిమిషం ఉండమని కోరారని. సాధారణంగా సినిమాల్లో కంటిన్యుటీ కోసం ఒకే రకం దుస్తులను రెండు కుట్టించేవారని, ఒకటి నటుడికి, మరొకటి డూప్‌కు లేదా అదనంగా వాడకుండా భద్రపరచడానికి ఉపయోగించేవారని తెలిపారు. ఈ సందర్భంలో, ఆయన ధరించిన తెల్ల సూట్‌లో వాడనిది ఒకటి ఉందని, దాన్ని బహుమతిగా తీసుకోవాలని ఆమె కోరారు. మొదట తాను వద్దని సంశయించినా, జయసుధ గారు, “లేదు లేదు, ఇది వాడింది కాదు ఇది, వాడకుండా ఉంచాం ఒకటి. నువ్వు బాగా ఇష్టపడ్డావు కదా, బాబుమోహన్ గారు నేను మేము అద్దంలో నువ్వు చూసుకుంటూ ఉంటే చూసాము” అని చెప్పి బలవంతంగా ఆ సూట్‌ను ఆయన కారులో పెట్టించారు. ఆ సూట్ పట్ల తన తండ్రి జ్ఞాపకాలే కారణమని ఆయన చెప్పినా, జయసుధ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆనాటి నుండి ఆ తెల్ల సూట్‌ను ఆయన ఎప్పుడూ ధరించలేదని, తన తండ్రి పట్ల ఉన్న ప్రేమకు గుర్తుగా ఇప్పటికీ భద్రంగా దాచుకున్నానని వెల్లడించారు. ఈ ఆత్మీయ బహుమతితో పాటు, నటుడు తన బాల్య స్మృతులను కూడా పంచుకున్నారు. ముఖ్యంగా, చెట్లపై గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు.

“బాగా ఎక్కువ చెట్ల మీదనే ఉండేవాడిని” అని ఆయన నవ్వుతూ చెప్పారు. చిన్నతనంలో జామకాయలు, మామిడికాయలు, ముఖ్యంగా సీతాఫలం కాయల కోసం ఆయన చెట్లను ఎక్కిన తీరును వివరించారు. వారికి రెండు ఎకరాల సీతాఫలం తోట ఉండేదని, ప్రతి ఆదివారం తనను ఆ తోటకి తీసుకెళ్లేవారని తెలిపారు. ఆ తోటలో ఆయన కోసం ప్రత్యేకంగా రెండు చెట్లను కేటాయించేవారట. “ఈ బాబు చెట్లు” అని పిలవబడే ఆ చెట్ల పండ్లను ఎవరూ తీసుకోకూడదు. ఆ చెట్లపైకి తనను ఎక్కించేవారని, తాను అక్కడే కూర్చుని పండిన కాయలను చూసి తెంపుకొని తినేసి దిగేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..