ఎక్తా కౌశల్య అనే యువతి తన జీవితంలో తొలిసారి రాపిడో బైక్ రైడ్ బుక్ చేసుకుంది. రైడ్ కోసం వచ్చిన పార్త్ చమారియాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రయాణం మొదలైన తర్వాత ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. అలా సరదాగా సాగిన సంభాషణలో పార్త్ తన గురించి చెప్పిన విషయం ఎక్తాను ఆశ్చర్యపరిచింది. అతడు ఓ జాతీయ స్థాయి అథ్లెట్. క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నది పార్త్ కల. అందుకోసం శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణ కొనసాగించాలంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన పరిస్థితి. దీంతో రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎక్తాకు అతడు కష్టపడే తత్వం, లక్ష్యం పట్ల ఉన్న నిబద్ధత బాగా నచ్చాయి. రైడ్ ముగిసినా అతడి ఆలోచనలు వెంటాడాయి!
ఎక్తా కూడా కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. పార్త్‌తో తొలి పరిచయం ఆమె మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రైడ్ పూర్తయింది. పార్త్ ఆమెను గమ్యస్థానంలో దింపి వెళ్లిపోయాడు. కానీ అతడితో జరిగిన సంభాషణ మాత్రం ఎక్తా మనసులో నుంచి చెరిగిపోలేదు. అతడిని మళ్లీ కలవాలనిపించింది. దీంతో ఇంకెందుకు ఆలస్యం అనుకుందో ఏమో అదే రోజు రాత్రి ధైర్యం చేసి పార్త్‌కు మెసేజ్ చేసింది. అలా మొదలైన మెసేజ్‌ల పరిచయం ఆ తర్వాత కలుసుకోవడం, మాట్లాడుకోవడం వరకు వెళ్లింది. క్రమంగా ఇద్దరి మధ్య అనుబంధం పెరిగి ప్రేమగా మారింది. పార్త్ తన శిక్షణ కోసం సమయం కేటాయిస్తే ఎక్తా డ్యాన్స్ రిహార్సల్స్‌లో బిజీగా ఉండేది. అయినప్పటికీ ఇద్దరూ తమ పనుల మధ్యలో కలుసుకునేవారు.
ఆ చిన్న చిన్న కలయికలు, సంభాషణలే వారి బంధాన్ని మరింత బలపరిచాయి. View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) ఒకరి కలలకు మరొకరు అండగా ఈ ప్రేమకథలో విశేషం ఏమిటంటే ఇద్దరూ తమ తమ వృత్తుల్లో ఎదుగుతూనే ఒకరికొకరు అండగా నిలిచారు. గత ఏడాది పార్త్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు కొరియోగ్రాఫర్‌గా ఎక్తాకు ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ వంటి స్టార్లతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం లభించింది. ఇద్దరూ తమ కలల కోసం కష్టపడుతూనే ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ప్రేమకథ ఇటీవల ‘Official People of India’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ఈ జంట ప్రేమకథను ఓ వీడియో రూపంలో పంచుకుంది. అందులో తమ తొలి పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారిన ప్రయాణం గురించి ఎక్తా, పార్త్ వివరించారు.’ఒక్క బైక్ రైడ్ నా జీవితాన్ని ఇంతలా మారుస్తుందని అనుకోలేదు. అదే నన్ను నా జీవిత ప్రేమ దగ్గరకు తీసుకెళ్తుందని తెలియదు’ అంటూ ఎక్తా మాట్లాడింది. వీడియో చూసిన నెటిజన్లు ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఎంత అందమైన ప్రేమకథ ఈ జంట చూడముచ్చటగా ఉంది’, ‘మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. జీవితాంతం సంతోషంగా, సంతోషాలతో ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.




