టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనదైన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ డెస్టినేషన్ అత్యంత వైభవంగా గ్రీస్‌లో జరుగుతోంది. ఈ వేడుకకు ఇప్పటికే సినీ, రాజకీయ నాయకులు గ్రీస్ దేశం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు వివాహ వేదికగా గ్రీస్‌ను ఎంచుకోవడం వెనుక ఉన్న ప్రత్యేకతల గురించి పలు ఆసక్తికర విషయాలు గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ వివాహ వేడుకలు గ్రీస్‌లోని అందమైన శాంటోరిని ప్రాంతానికి సమీపంలో ఘనంగా జరుగుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వంటి ప్రముఖులు ఈ వివాహ వేడుకలో పాల్గొనేందుకు గ్రీస్‌కు బయలుదేరిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అతిథుల కోసం ప్రత్యేకంగా నాలుగు ప్రైవేట్ విమానాలను ఏర్పాటు చేయడంతో పాటు, వారి వసతి, రవాణా ఏర్పాట్లను మారన్ కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా చూసుకున్నట్లు తెలుస్తోంది. గ్రీస్‌ను వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఎంచుకోవడానికి కారణాలు: ప్రపంచవ్యాప్తంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు గ్రీస్ అత్యంత ప్రసిద్ధ దేశాలలో ఒకటిగా నిలిచింది.

ఈ జంట గ్రీస్‌ను ఎంచుకోవడానికి అనేక ప్రత్యేకతలు కారణమని ట్రావెల్ నివేదికలు చెబుతున్నాయి. గ్రీస్‌లో ఏడాదిలో సుమారు 300 రోజులు ఎండతో కూడిన ఆహ్లాదకరమైన మధ్యధరా వాతావరణం ఉంటుంది. ఇది ఓపెన్ ఎయిర్ వెడ్డింగ్స్, రిసెప్షన్‌లకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే సముద్రతీరాలు, చారిత్రక కట్టడాలు, తెల్లటి అందమైన భవనాలు వివాహ వేడుకలకు అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌ను అందిస్తాయి. గ్రీక్ సంస్కృతిలో అతిథులను దేవుడిగా భావించే ‘ఫిలోజెనియా’ అనే ఆతిథ్య సంప్రదాయం ఉంది. ఇది అక్కడికి వచ్చే అతిథులకు మరువలేని అనుభూతిని ఇస్తుంది. గ్రీక్ వంటకాలు, స్థానికంగా లభించే సముద్రపు ఆహారం , ప్రసిద్ధ వైన్స్ ఈ వేడుకలను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. వైన్ కూడా ప్రత్యేకమే.

డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు గ్రీక్ వంటకాలు మరో ప్రధాన ఆకర్షణ. ఈ దేశం దాని అద్భుతమైన వైన్‌లు, స్పిరిట్‌లకు కూడా ప్రసిద్ధి చెందింది. స్థానిక వైన్ తయారీ కేంద్రాలు విడియానో ​, మోస్చాటో స్పినాస్ వంటి దేశీయ ద్రాక్ష రకాలను ఉపయోగించి అసాధారణమైన బ్రాండ్‌లను ఉత్పత్తి చేస్తాయి. అదే సమయంలో ఊజో, మాస్టిహా వంటి సాంప్రదాయ పానీయాలు వివాహ వేడుకలకు విలక్షణమైన గ్రీకు సొబగును అందిస్తాయి. ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్.. ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..