ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. విజయవాడ వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ.. పరివర్తన రాజనీతి పార్టీగా ప్రకటించారు. పరివర్తన రాజనీతి పార్టీ.. జెండా తెలుపు, కాషాయ రంగులో ఉండగా.. జెండా మధ్యలో ధర్మచక్రం ఉంచారు.
ఏపీలోని ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయం పార్టీని స్థాపిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజాసమస్యలు, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టంచేశారు. ముహూర్తం ప్రకారం.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. రాయలసీమ పౌరుషాన్ని నిలబెట్టేందుకు ఏకాదశి రోజున పార్టీని స్థాపించబోతున్నట్టు గతంలో తెలిపిన విజయసాయిరెడ్డి.. అందరికీ సమన్యాయం చేస్తామన్నారు.
రాష్ట్రంలో ప్రధానమైన రెండు పార్టీలు, కుటుంబాల ఆధిపత్యానికి ముగింపు పలుకుతామన్నారు. అందుకోసం యువతకు పెద్దపీట వేస్తామన్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి పార్టీవైపు కొందరు నేతలు చూస్తుండటంతో.. ఏపీ రాజకీయాలు ఎలా మారుతాయన్న ఆసక్తి నెలకొంది.




