దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా సందడి మొదలవుతుంది. ఇళ్లన్నీ రంగురంగుల దీపాలతో వెలిగిపోతుంటే.. వీధులన్నీ బాణాసంచా శబ్దాలతో మారుమోగుతుంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో దీపావళిని జరుపుకుంటారు. అయితే కొందరు మాత్రం పండుగ వేడుకల్లో చేసే వింత పనులతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా అలాంటి ఓ మామయ్య చేసిన ప్రమాదకర విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఒళ్లుగగుర్పాటుకు చేశాయి. రాత్రి సమయంలో ఓ వీధిలో దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. చుట్టూ బాణాసంచా కాలుస్తూ ప్రజలు సందడి చేస్తున్నారు. ఇంతలో ఎరుపు రంగు టీ-షర్టు ధరించిన ఓ వ్యక్తి చేతిలో మండుతున్న టపాకాయలను పట్టుకుని వింత విన్యాసం మొదలుపెట్టాడు. సాధారణంగా టపాకాయలు వెలిగించిన వెంటనే వాటికి దూరంగా వెళ్లిపోతుంటారు.

కానీ ఇతగాడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. చేతిలో మండుతున్న టపాకాయల లడీని గిరగిరా తిప్పుతూ డ్యాన్స్ చేస్తున్నట్లుగా విన్యాసాలు చేశాడు. నిప్పురవ్వలు చుట్టూ ఎగిసిపడుతున్నా, పెద్ద ఎత్తున శబ్దాలు వస్తున్నా ఏమాత్రం భయపడకుండా తన ప్రదర్శన కొనసాగించాడు. అప్పుడప్పుడు చేతులు పైకెత్తుతూ, టపాకాయలను తన చుట్టూ తిప్పుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విన్యాసాన్ని చూసిన నెటిజన్లు దీనికి సరదాగా ‘దీపావళి హెలికాప్టర్ స్టంట్’ అని పేరు పెట్టారు. ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. కొందరు అతగాడి ధైర్యాన్ని చూసి నవ్వుకుంటుంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేవలం సరదా కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం సరికాదని హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా, ఇలాంటి విన్యాసాల వల్ల పక్కన ఉన్నవారికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పండుగ అంటే ఆనందం.. కానీ ఆ ఆనందం కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం?

అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా అయన చేసిన వింత విన్యాసం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే బాణాసంచాతో ఇలాంటి విన్యాసాలు చేయడం అత్యంత ప్రమాదకరం. ఎవరూ వీటిని అనుకరించవద్దని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.. Uncle got no chills for this diwali The confidence on display is unbelievable. Every other person is probably standing miles away, covering their ears and praying for their fingers, while uncle is out here performing his own Diwali helicopter stunt. Jokes aside, holding or rotating a lit firecracker is extremely dangerous. The sparks and unpredictable explosions can cause severe burns, hand injuries and permanent damage. — Deepu (@deepu_drops) November 9, 2026 మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..