U19 Asia Cup 2026: అండర్-19 ఆసియా కప్ 2026 (U19 Asia Cup 2026) టోర్నీలో కీలకమైన సెమీఫైనల్ సమరానికి నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. గ్రూప్ దశలో పోటీపడి నిలిచిన భారత్ (India U19), పాకిస్థాన్ (Pakistan U19), ఆఫ్ఘనిస్థాన్ (Afgh), బంగ్లాదేశ్ (Bangladesh U19) జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. నవంబర్ 12న రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భారత జట్టు ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. మరో సెమీఫైనల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన జట్లు నవంబర్ 14న జరిగే ఫైనల్లో టైటిల్ కోసం పోటీపడతాయి. సెమీఫైనల్‌కు చేరిన నాలుగు జట్లు ఇవే..! గ్రూప్-ఏలో పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలవగా, భారత్ రెండో స్థానంతో సెమీఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్-బీలో ఆఫ్ఘనిస్థాన్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న భారత్‌కు గ్రూప్-బీ విజేత ఆఫ్ఘనిస్థాన్ ప్రత్యర్థిగా నిలిచింది.
మరోవైపు పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఎక్కువమంది చదివినది: Video: 3.2 ఓవర్లలో 7 పరుగులు.. హ్యాట్రిక్‌తోపాటు 6 వికెట్లు.. టీమిండియా బౌలర్ నయా రికార్డ్ గుర్తుందా..? U19 Asia Cup 2026 సెమీఫైనల్ షెడ్యూల్.. తొలి సెమీఫైనల్: మ్యాచ్: పాకిస్థాన్ U19 vs బంగ్లాదేశ్ U19 తేదీ: నవంబర్ 12, 2026 సమయం: ఉదయం 10:30 గంటలకు (IST) వేదిక: మినిస్ట్రీ టర్ఫ్ 2, అల్ అమరత్, ఒమన్ రెండో సెమీఫైనల్: మ్యాచ్: ఆఫ్ఘనిస్థాన్ U19 vs భారత్ U19 తేదీ: నవంబర్ 12, 2026 సమయం: ఉదయం 10:30 గంటలకు (IST) వేదిక: మినిస్ట్రీ టర్ఫ్ 1, అల్ అమరత్, ఒమన్ ఫైనల్ ఎప్పుడంటే? సెమీఫైనల్ విజేతల మధ్య ఫైనల్ పోరు నవంబర్ 14న జరగనుంది. ఈ మ్యాచ్‌కు కూడా ఒమన్‌లోని అల్ అమరత్ వేదిక కానుంది. మినిస్ట్రీ టర్ఫ్ 2లో ఉదయం 10:30 గంటలకు (IST) ఫైనల్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు అండర్-19 ఆసియా కప్ 2026 విజేతగా నిలుస్తుంది.
ఎక్కువమంది చదివినది: 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ప్రపంచ రికార్డుతో తొలి టీంగా జింబాబ్వే సంచలన రికార్డ్..! సెమీస్‌లో భారత్‌కు ఆఫ్ఘనిస్థాన్ సవాల్.. భారత యువ జట్టు గ్రూప్ దశలో నేపాల్, యూఏఈపై విజయాలు సాధించింది. అయితే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. అయినప్పటికీ రెండు విజయాలతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకోవాలని భారత యువ ఆటగాళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య కూడా ఆసక్తికర పోరు జరగనుంది. మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




